నా పుట్టినరోజు సందర్భంగా నిన్న (23-8-2019) ఐదు మొక్కలు నాటాము. నా స్వగ్రామం చొప్పకట్లపాలెం గ్రామం లో పల్లెప్రపంచం కార్యాలయం వద్ద నాలుగు గానుగ మొక్కలు, ఒక వేప మొక్క నాటడం జరిగింది. " మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి " అనేది నా విజన్ లో భాగంగా ఈ పని చేశాను. కోటి మొక్కలు పెంచాలని నిర్ణయించుకుని గతంలో కొన్ని మొక్కలు నాటాము. మధ్యలో ఆర్ధిక కారణాలతో ఈ కార్యక్రమం కుంటుపడింది. అందుకే ఈసారి సింపుల్ గా ఈ కార్యక్రమం చేశాను. నేను, మా పెద్దక్క (మండెపుడి విజయలక్ష్మి), ప్రస్తుతం నేను కొత్తగా కొన్న ఇల్లు మాజీ యజమాని, గ్రామ సి.పి.ఎం నాయకుడు బొప్పాల అజయ్ కుమార్, ప్రస్తుతం ఇంటి రిపేరు పనులు చేస్తున్నసుతారు మేస్త్రీ షేక్ రఫీ, కార్పెంటర్ మేస్త్రీ వజ్రాల రాధాకృష్ణ లు ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. ఐదు తో మొదలైన ఈ మొక్కల పెంపకం కోటి వరకు కొనసాగించేందుకు ప్లాన్ చేసుకున్నాను. వ్యక్తి గా కంటే శక్తి(సమూహం)గా ఈ పని చేయడం తేలిక కనుక సామూహికంగా ఈ పని కొనసాగుతుంది.


Post a Comment

 
Top