తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నది. ఆ మేరకు కొన్ని అడుగులు పడినా ఇప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉన్నది. ఫీల్డ్ లెవల్ లో భా.జ.పాకు పని చేసే కార్యకర్తలు లేరు. కొత్తవారిని ఎదగనివ్వగల విశాల హృదయం పార్టీ రాష్ట్ర నేతలకు లేదన్న విమర్శా ఉన్నది. దేశవ్యాపితంగా జెండా ఎదుగుతూ ఎగురుతున్నప్పటికీ దక్షిణాదిన  తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళనాడులోనూ భా.జ.పా ఎదుగుదల అంత  సులువుగా జరిగే పనికాదు. అలాగని అసాధ్యం అనీ చెప్పలేము.  ఓ రాజకీయ పార్టీగా ప్రతివారు తాము బలపడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.  తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణాలో భా.జ.పా ఎదుగుదలకు ఉన్న అవకాశాలు, ఆటంకాలు ఏమిటన్నదానిపై మీ అభిప్రాయం పంచుకోవాలని విజ్ఞప్తి.
- పల్లా కొండలరావు

Post a Comment

  1. "ఫీల్డ్ లెవల్ లో భా.జ.పాకు పని చేసే కార్యకర్తలు లేరు"

    చిన్నా పెద్దా పట్టణాలలో ఆర్యేసైస్ శాఖలు ఉన్నాయి

    "దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళనాడులోనూ భా.జ.పా ఎదుగుదల అంత సులువుగా జరిగే పనికాదు"

    ఈ విషయంలో తెలంగాణాను తమిళనాడు & కోస్తా ఆంధ్రలతో పోల్చడం పొరబాటు.

    ReplyDelete

 
Top