డైట్ షీట్
 👉 ఉదయం ముఖం కడగగా నే రెండు గ్లాసుల నీరు తాగాలి. గంట తరువాత మళ్ళీ రెండు గ్లాసుల నీరు తాగాలి.
 👉టిఫిన్ కి 30 నిమిషాల ముందు గ్లాస్ జ్యూస్ తాగాలి. వీటిలో తేనే, నిమ్మరసం కలపాలి.
👉 టిఫిన్ గా తేలికైన ఆహారాలు తీసుకోవాలి. నూనెలో వేయించినవి తినవద్దు.
👉  భోజనానికి 30 నిముషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. భోజనం ముగిసిన గంటన్నర నుండి ప్రతీ గంటకూ ఒక గ్లాసు నీరు తాగాలి.
👉 అన్నం లో 50% కూర తినాలి. ఆకు కూరలు ఎక్కువ వాడాలి. ఉప్పు,  కారం,  నూనెలు బాగా తగ్గించాలి.
👉 రుచి కోసం పల్లీ పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మినుముల పొడి కలుపుకోవాలి.
👉 మాంసం, చాపలు, కోడి గుడ్డు, నిల్వ పచ్చడి, బిర్యానీలు, పాకెట్ పాలు వాడవద్దు.
👉 సాయంత్రం నాలుగున్నర గంటలకు గ్లాస్ జ్యూస్ తాగాలి.
👉 సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు గ్లాసుల నీరు తాగాలి.
👉 సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం తినడం పూర్తి కావాలి.
👉 రాత్రి డిన్నర్ లో పండ్లు తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి తినాలి.
👉 వీలుని బట్టి రోజులో మూడు నుంచి నాలుగు గ్లాసులు మజ్జిగ తాగాలి.

Post a Comment

 
Top