Post a Comment

 1. కొండల రావు గారూ,
  దయచేసి ఇలాంటివి పంచకండి. వైద్యపరిశోధనల్లో నిరూపితం కాని చిట్కాల వంటివి అనుసరించటం వలన ప్రజలకు మేలు కన్నా కీడు జరిగే అవకాశమే ఎక్కువ. ఈ నావెల్ కరోనా వైరస్ తత్వం గురించీ దాన్ని అరికట్టే విధానం గురించి ప్రస్తుతం ఇంకా వైద్యశాస్త్రం పరిశోధనల్లోనే ఉంది కాని ఇదీ-నివారణ అంటూ ఏమీ ప్రకటించలేదు.

  ReplyDelete
  Replies
  1. క్షమించాలి. prevention అనగా నివారణ ఇలాగు చేయవచ్చును అని వైద్యశాస్త్రపరంగా ఏ మందులూ ఇంతవరకూ స్పష్టం కాలేదు.

   ఎండతీవ్రతకు ఒకరోజులో చనిపోతుంది వంటివి ఇంకా నిర్ధారణగా చెప్పట లేదు వైద్యపరిశోధనలు.

   కాచిచల్లార్చిన నీళ్ళు ఎక్కువ సార్లు త్రాగటం - అందులో తేనె కాని నిమ్మరసం కాని కలపి 5 లేదా 6సార్లు త్రాగటం మంచిది, ఇలా లంఘనం చేస్తే శరీరం తనను తాను నయం చేసుకుంటుంది అనటం అంత సరికాదు వైద్యశాస్త్ర రీత్యా. సాధారణంగా పూర్ణారోగ్యవంతులకు చాలా వరకూ ఇది ఫరవాలేదు. డయాబెటిస్ ఉన్నవారు తేనె ఎలా తీసుకుంటారు? ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు నిమ్మరసం వలన ఎసిడిటీ వస్తుంది.

   రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం కాని దేహానికి కాదు వంటి జనాకర్షక వాక్యాలు పొరపాటు ముక్కలు. పౌష్ఠికాహారం లేకపోతే రోగనిరోధం కష్టం అన్నది వైద్యశాస్త్రం మాట. దీనికి పాత కాలపు పిడుక్కీ బియ్యానికీ లంఘనం అన్న సూత్రానికీ చుక్కెదురు అని గ్రహించండి.

   ఇంకా ఈవీడీయోలో చాలా అశాస్త్రీయభావనా ప్రచారం కనిపించింది. సమయాభావం వలన 5ని. ముందే వీడియో చూడటం ఆపేసాను.

   ఇటువంటీ చిట్కాలు పనిచేయకపోవటమే కాని చావులసంఖ్యను పెంచటానికి ప్రయత్నిస్తాయి.

   మీకు నా అభిప్రాయాలు నచ్చకపోవచ్చును. కాని ఇలా సొంతవైద్యం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం విజ్ఞతకాదని చెప్పక తప్పదు.

   ఇలా అపోహలూ తప్పుడు వైద్యాలూ - చిట్కాలూ వంటివి దయచేసి చెప్పకండీ, ప్రచారం చేయకండీ అని వైద్యరంగమూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయని గమనించ ప్రార్థన.

   Delete
  2. ఇది ప్రభుత్వం గుర్తించిన నేచురోపతి వైద్యంకు చెందినది శ్యామలరావు గారు. వీడియో పూర్తిగా చూడండి. ఈ సమయం లో ఇలాంటివి ఆరోగ్యం పట్ల కొంత అవగాహనకు ఉపయోగపడతాయి.

   Delete
  3. కొండలరావు గారూ,

   నేను వీడియో చూడలేదు.

   ఇటీవలి కాలంలో కొరోనా గురించి ఏవేవో గమ్మత్తు చిట్కాలు సామాజిక మీడియాలో రావడం, వాటిని పాటించి కొందరు జనాలు ఆపత్తు కొనితెచ్చుకోవడం చూస్తున్నాము. సందట్లో సడేమియా అన్నట్టు చికెన్ తినడం వలన కొరోనా వస్తుందనే తప్పుడు పుకార్లు కూడా రావడం దుఃఖప్రదం.

   శ్యామలీయం మాస్టారు హితవాక్యాలను మన్నించడం అందరికీ మేలు చేసినట్టవుతుంది.
   వారు చెప్పినట్టు ప్రస్తుత విపత్కర స్థితిలో ఇటువంటివి పంచడం హర్షణీయం కాదు. శీర్షికలో "కొరోనా బాబు వచ్చినా ఏం చేయలేదు" అనడం మూలాన అమాయకులు (లేదా మూర్ఖులు) ఇదొక్కటే పాటించి సామాజిక దూరం వంటి నియమాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఎంతయినా ఉంది.

   మంతెన వీరమాచినేని వగైరాల మీద మీ నమ్మకం మీది. ఇప్పటి టపాలో "అధికార నిపుణులు చెప్పిన వాటితో పాటు ఇది *కూడా* చేయండి" అంటూ రాస్తే కొంతవరకు ఫరవా లేదు. కుదిరితే సామాన్య పరిస్థితులు తిరిగి నెలకొన్న తరువాత వరకు దీన్ని వాయిదా చేస్తే ఇంకా మంచిది.

   True prevention is better than cure but only if it is scientifically established that the actions prevent the problem. In any case, it is too late to prevent COVID as it has already struck.

   Delete
  4. వచ్చిన చిక్కేమిటంటే జై గారు. ఆరోగ్యం వేరు. వైద్యం వేరు. ఆరోగ్యం బాగుంటే వైద్యం అవసరం లేదు. అలవాట్లు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం చెడిపోతే వైద్యం అవసరం ఉంటుంది. కరోనా వచ్చినా అందరూ చనిపోరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కూడా అదే. డయాబెటిస్, గుండెపోటు ఉన్నవారు, ముసలి వారు ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండాలి. వైరస్ కు మందు కనుగొనేలోపు ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏమిటన్నది ప్రభుత్వం గుర్తించిన నేచురోపతి సూచనలు మంతెన చెప్పేవి. కరోనా పట్ల ఎక్కువ ఆందోళన చెండడమూ, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడమూ మంచిది కాదు. మంతెన, వీరమాచినేనిలు చెప్పే ఆరోగ్యవిధానాలలో మంచిని స్వీకరించాలి. రోగం వస్తే డాక్టర్ ( ప్రభుత్వం గుర్తించిన ఆరు రకాల వైద్యాలు (గుర్తించనివి ఐదువేల రకాలున్నాయి ప్రపంచమ్లో) ఏదో ఒకటి ఆశ్రయించాలి. మీకు వీలయితే మంతెన వీడియోలు ఈ బ్లాగులో ఉంచినవి పూర్తిగా చూసి మీ అభిప్రాయం చెప్పగలరు. శ్యామలీయం మాష్టారు వాదనతో ఈ విషయంలో నేను ఏకీభవించలేను. ఆయన మంచికోసం చెప్పారని, ఆయన ఉద్దేశం మంచిదని మాత్రం తెలుసు. కానీ నేను మంచి అని గుర్తించినదానిలో చెడుని నిరూపించకుండా వెనుకకు తీసుకోను. ధన్యవాదములు.

   Delete
  5. ఇంట్లో ఉండాలని, స్వీయ నిర్భంధం కూడా నివారణ చర్యల్లో భాగమే. కే.సీఽఅర్, మోడీలు నాకు నచ్చదు కనుక నేను వినను అనడం తప్పవుతుంది. మందు కనిపెట్టారు, చైనా కుట్ర వంటి మోసపూరిత ప్రచారాలు వేరు, ముందు జాగ్రత చర్యల పట్ల ప్రజలను చైతన్యపరచడం వేరు.

   Delete
 2. MIT శాస్త్రజ్ఞుల ప్రయోగాలలో 'ఉష్ణ మండల, ట్రాపికల్ ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది అని చెబుతున్నారు.

  మంతెన గారు చెప్పిన ప్రకృతి వైద్య సూచనలు సాధారణ రోగాలకు బాగున్నాయి.
  అయితే ' వీడియో కు పెట్టిన శీర్షిక ' కరోనా బాబు వచ్చినా ఏమీ చేయలేదు' అన్నది సరికాదు.

  ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇలా లంఖణ వైద్యం చెప్పడం సరికాదేమో.

  ReplyDelete
  Replies
  1. వీడియో శీర్షిక గుడ్ హెల్త్ వారు పెట్టినది. అది వ్యూస్ ఆకర్షణ కోసం పెట్టినది. హెడింగ్ మార్చాను. GKK గారు.

   వేడిలో వ్యాప్తి చెందదు అనేది పూర్తి స్థాయి నిర్ధారణ జరగాల్సి ఉన్నది. కరోనా రాకుండా ఉండాలంటే వీలయినవారికి ప్రకృతి జీవన విధానంపై అవగాహన ఉన్నవారికి ఈ వీడియోలు ( అన్నీ చూడండి) తప్పక ఉపయోగపడతాయి. హాని చేసే లేదా అశాస్త్రీయ అమ్శాలు లేవు. అంటే గోమూత్రం త్రాగితే తగ్గుతుంది, ఎయింస్ లో మందు కనిపెట్టారు, చైనా కుట్ర.... ఇలాంటి హిందూ మతోన్మాదుల ప్రచారానికి నేచురోపతి సూచనలకు లింక్ పెట్టి చూడడం మాత్రం సరికాదు. లంఖణం పరమౌషధం అన్నది నేచురోపతి చెపుతున్నది. ఇటీవల సైంటిష్టులు కూడా తేల్చి మెడికల్ జర్నల్స్ లో ప్రచురుణ కూడా చేస్తున్నది. భారతీయ వైద్య విధానం అయిన ఆయుర్వేదం, హోమియోపతి లలో చాలా మంచి విషయాలు మరుగునపడడం కేవలం అల్లోపతికే అధికప్రధాన్యం ఇవ్వడం, ఫార్మా కంపెనీల కుట్రలను దాటి ప్రజాసైన్స్ ప్రగతి సాధించాల్సి ఉన్నది.

   Delete
  2. మిత్రులు కొండలరావు గారు,

   ప్రజాసైన్స్ అనే కొత్తమాటను తయారు చేసినందుకు అభినందనలు. అలాగే హిందూ మతోన్మాదుల గురించి సందర్భం చూచుకొని ప్రసంగించినందుకు కూడా అభినందనలు.

   మీరు అన్న "అలవాట్లు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది" అనే మాట సాధారణపరిస్థితుల్లో వచ్చే శరీరతత్త్వవికారజనితమైన రోగాలకు అన్వయిస్తుంది కాని అంటురోగాలకు కాదు. సంపూర్ణారోగ్యంతో కనిపించే వారినీ అంటురోగాలు పీడించగలవు. తమాషా ఏమిటంటే కొందరు అంటురోగాలతో తిరుగుతూనే పైకి ఆరోగ్యంగానే కనిపిస్తూ అందరికీ ఆరోగాలను అంటించటం జరుగుతూ ఉంటుంది.

   నాకు ఈనాచురోపతీ 70ల నుండే మంచిపరిచయంలో ఉన్నది. స్వయంగా హోమియోవైద్యం కూడా చేసేవాడిని 90ల మధ్యభాగంలో యూ.ఎస్. వెళ్ళే వరకూ. ఆయుర్వేదవైద్యం మాచిన్నప్పటినుండీ ఇంటివైద్యం - మా ఫామిలీడాక్టరు గారు ఆయుర్వేదవైద్యులు అప్పట్లో.

   ఈకరోనా వైరస్ అనేది ఒకజాతి వైరస్ సమూహం. ఇందులో ఈ నావెల్ కరోనా అనేది అక్షరాలా కొత్త వెరైటీ. దీని లక్షణాలగుర్తింపూ వైద్యమూ కూడా ప్రస్తుతానికి పరిశీలన అభివృధ్ధి దశల్లో ఉన్నాయి. సంప్రదాయిక ప్రత్యామ్నాయవైద్యవిధానాలు ఇంకా ఈ నావెల్ కరోనాపై తగినంత సన్నధ్ధంగా లేవన్నది నిజం - మీరు నమ్మినా నమ్మకపోయినా సరే. అందుచేత సంప్రదాయిక వైద్యపరమైన చిట్కాల జోలికి పోవటం ఎంతమాత్రం క్షేమం కాదు. మొన్నటిదాకా ఆర్స్ ఆల్బ్ అనే హోమియో మందును ప్రభుత్వం వాడమన్నది అన్న ప్రచారం జరిగింది. ఆముక్కనూ నేను ఖండించాను. ఆ దరిమిలా ప్రఖ్యాత హోమియో వైద్యులూ ఆర్స్ ఆల్బ్ విచక్షణ లేకుండా ప్రొఫిలాక్టిక్‍గా వాడటం తప్పనే హెచ్చరించారు.

   ఇకపోతే అధునాతన వైద్యం అంతా ఫార్మా కంపెనీల కుట్రలే అని వాదిస్తే ఇంక ఎవరూ చెప్పగలగింది ఏమీ లేదు.

   ఈమాటలు ఇక్కడ వ్రాస్తున్నది మీతో వాదించాలని కాదు, నా ప్రజ్ఞను చూపటానికీ కాదు. మిమ్మల్ని తప్పుపట్టుకోవటం కూడా నా ఉద్దేశం కాదు. మీదృష్టికి వచ్చిన వైద్యసలహా(ల)ను మీరు ప్రచురించారు కొంత నమ్మకంతో. అటువంటి సలహాల మాటున ప్రమాదం పొంచి ఉందన్న నా ఆందోళనను మరొకసారి మీ దృష్టికి తేవటానికి తాపత్రయ పడుతున్నాను. అంతే.

   మీరు నా అభిప్రాయాలను అంగీకరించలేకపోతే క్షంతవ్యుడిని.

   Delete
  3. అంటే చైనా కుట్ర అన్నవారందరూ హిందూ మతోన్మాదులన్నమాట! హిందువులు తప్ప ఇంకెవరూ రోగానికి దేవుడికి లింకు పెట్టారన్నమాట. ఎప్పుడూ ఇలాగే అనిపిస్తోందా లేక ఈమధ్యనేనా?

   Delete
  4. చైనా కుట్ర అని మీరు ఎలా నిర్ధారణ చేశారు? అమెరికా దుష్ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థనే తీవ్రంగా ఖండించింది. చైనా ఊహాన్ లో కరోనాను కట్టడి చేసిన విధానం ను అభినందించింది. ఇపుడు భారత్ తో సహా అందరూ ఫాలో అవుతున్నదీ ఆ పద్దతినే. కోవిడ్ 19 కు (కరోనాలో కొత్త రకం) మందు కనుగొనే వరకూ స్వీయకట్టడే నివారణ.

   హిందువులు ఎపుడూ రోగాన్ని, మందునూ, ప్రకృతినీ సరిగానే అంచనా వేశారు. ప్రపంచానికి మొట్టమొదటి వైద్య గ్రంధాన్ని (ఆయుర్వేదం) అందించినదీ హిందువులే. ప్రకృతి ఆరాధన, ప్రకృతి జీవన విధానం ఆచరణలో ముందున్నది హిందువులే. ఆరోగ్యానికి అనేక మంచి అలవాట్లు కలిగిఉన్నదానిలో ముందున్నదీ హిందువులే. కానీ అన్నీ భారత్ లోనే, అంతా గో మూత్రం లోనే అంటూ వితండవాదం చేసే హిందూమతోన్మాదులతో హిందూజాతికే ప్రమాదం. ఈ విషయంలో నాకెపుడూ ఒకేలా అనిపిస్తుంది.

   చైనా కుట్ర అంటూ అబద్దాలు ప్రచారం చేసిన దేశభక్తులు నేడు ఆ చైనా మార్గం లోనే అంతకు మించిన కట్టడి, కర్ఫ్యూలు అమలు చేయకతప్పడం లేదు. అన్ని దేవాలయాలు మూసుకు కూర్చోవలసిన స్థితి. ప్రకృతిని సరిగా వాడుకోవడం అన్నది మనం ఏ మతం నుండైనా స్వీకరించవచ్చు. మతం లో ఏది వికృతం అన్నది తేల్చేది, తేల్చాల్సింది ఎప్పటికైనా ప్రజాసైన్హ్సే.

   Delete
  5. శ్యామలీయంMarch 27, 2020 at 10:45:00 PM GMT+5:30

   గురువు గారు నమస్కారం. మీతో నాకున్న పరిచయం అందరు బ్లాగర్లకు తెలియదు. అదే సందర్భంలో ఓ విషయం పై విభేదించాల్సి వచ్చినపుడు, అదికూడా సమాజహితంకు సంబంధించినది అయినపుడు నా వాదన అలాగే ఉంటుంది. తప్పుడు పదాలు ఏమైనా వాడితే మాత్రం క్షమించగలరు. మీ పట్ల నాకు ఎపుడూ సదభిప్రాయమే. కానీ మీ అభిప్రాయాలు కొన్నింటితో నేనెపుడూ విభేదిస్తూనే ఉన్నాను. దీనర్ధం నా అభిప్రాయమే గొప్పదని కాదు. నేను గొప్పదని నమ్మిన అభిప్రాయం వెల్లడించే హక్కు నాకున్నదికనుకనే.

   కరోనాలో కొత్తరకం కోవిడ్ 19 కు కూడా అందరూ చనిపోరు. రోగ నిరోధక శక్తి అనేది మన చేతులలో, చేతలలో ఉన్నంతవరకూ వైద్యం అవసరం లేదు. సహజంగానే తగ్గిపోతుంది. కానీ మందు కనిపెట్టే వరకూ ఎవరైనా ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యవంతునిలో ఉండే వైరస్ ఇతర వ్యక్తులకు సోకే అవకాశం, ఆ కొత్త వ్యక్తికి ఆ సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల అతను వ్యాధికి గురి కావచ్చు. ఆ రోగి కూడా ముందుగా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. తగిన జాగ్రత్తలు పాటించినా వచ్చే అంటురోగాలకు తప్పనిసరిగా వైద్యమే దిక్కు. కానీ ప్రస్తుతానికి పర్ఫెక్ట్ మందు ఇంకా కనుక్కోలేదు. భయం కలిగించడం దాని ఆసరాగా సొమ్ము చేసుకోవడమ్కు, అవగాహన కలిగించి చైతన్యపరచడానికి తేడా ఉన్నది సర్. ఆ అవగాహనకూ, అన్నింటికీ ఫలానా జీవనవిధానమే దిక్కు అన్న దిక్కుమాలిన ప్రచారాలకూ ( హిందువులలో గోమూత్రం, క్రైస్తవులలో స్వస్థత కూటములు, వేలు ముంచే స్వాములు, కాలుతో తన్నే స్వాములు వగైరాలు బోలెడున్నాయి. ) తేడా ఉన్నదని గమనంలో ఉంచుకోవాలి.

   తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పారిశుధ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి అన్నది ప్రాధమిక సూత్రం ఎవరైనా చెప్పొచ్చు.
   తెలిసినవారు చెప్పడం ధర్మం. పాటించాలి కూడా. అది ప్రధాని మోడీ నుండి మంతెన దాకా మంచి మార్గం లో చెపితే విని అందులో మనం చేయగలిగింది చేస్తే మంచిదే. నేను పెట్టిన మంతెన వీడియోలలో అలా లేకపోతే వెంటనే తొలగించడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఉండాల్సిన అవసరమూ లేదు. దయచేసి మీరు ఆ వీడియోలన్నీ పూర్త్గిగా చూసి మరోసారి ఏ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు విరుద్ధమ్గా ఉన్నదో చెప్పడం మీ ధర్మం.

   హోమియోలో మాదిరిగానే అల్లోపతిలో లేదా ఏ వైద్య విధానమ్లొనైనా లోపాలు సహజం. మందులతో కూడా సైడ్ ఎఫెక్టులు సహజమే. అది ఫార్మసిస్టులూ, డాక్టర్లూ చెప్తారు. శ్రుతిమించితే బ్యాన్ కూడా చేస్తారు. నేచురోపతిలో మందులు ఉండవు కదా? ఆ భాగం వేరు. మందులు వాడాల్సి వస్తే ఖచ్చితమ్గా వాడాల్సిందే. మందులు వాడినా, డాక్టర్లు కృషి చేసినా చనిపోయే అవకాశాలు , డాక్టర్లు చనిపోతారని వదిలేసిన కేసులు బ్రతికి వైద్యరంగానికి సవాల్ గా ఉంటున్న కేసులూ ఉన్నాయన్నది నిర్వివాదాంశం.

   ఆధునిక వైద్యం అంతా ఫార్మా కంపెనీల కుట్ర అని నేననని మాటను మీరు కల్పించడం పద్ధతి కాదు. ఇపుడు సమాజానికి సేవ చేస్తున్నది వైద్యులు, వైద్యాలయాలే తప్ప దేవుడు, దేవాలయాలు, మత గ్రంధాలు కావని నేను చెపితే మీరలా వక్రీకరించడం మంచిది కాదు. ఫార్మా కంపెనీలు లాభాల కోసం చేసే కుట్ర పట్ల ఖచ్చితంగా ఎపుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇపుడు కూడా అవి తమ లాభాలకోసం పొంచి చూసే ప్రమాదం ఉన్నదన్నది గుర్తించాల్సిందే.

   ప్రజా సైన్స్ నేను సృష్టించినది కాదు గురువుగారు. ఎప్పటినుండో వైద్యం సామాజిక హితంతో ప్రభుత్వ రంగంలో ఉండాలని పోరాడుతున్న మహానుభావుల కల. నేను దానిని సమర్ధిస్తాను.

   వాదనలు వ్యక్తిగత ప్రతిభకోసం కాదు గనుక, అదీ ప్రజాహితం కోసం అయినపుడు మర్యాదలు, స్నేహాల కోసం నిజాలు చెప్పడానికి, నిజాలు తెలుసుకోవడానికి వెరువకూడదు సర్.

   Delete
  6. "అంటే గోమూత్రం త్రాగితే తగ్గుతుంది, ఎయింస్ లో మందు కనిపెట్టారు, చైనా కుట్ర.... ఇలాంటి హిందూ మతోన్మాదుల ప్రచారానికి నేచురోపతి సూచనలకు లింక్ పెట్టి చూడడం మాత్రం సరికాదు." అని మీరే అన్నారు.
   "చైనా కుట్ర" అనే మాట అన్నవారందరూ హిందూ మతోన్మాదులేనా అంటే "చైనా కుట్ర అని మీరెలా నిర్ధారించారు" అని మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనెక్కడ నిర్ధారించాను? హాస్యాస్పదంగా లేదూ!
   "గోమూత్రంతో వ్యాధి నయం అవుతుందని" ఒక వ్యక్తి అని ఉండవచ్చు. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని మీరు విమర్శించొచ్చు. మధ్యలో హిందూ మతోన్మాదం అనే పదం ఎందుకు దొర్లిందట? "చైనా కుట్ర" అని నిందించే క్రైస్తవున్నో ముస్లిమునో చూపిస్తే మీరేమంటారు? అపుడు కూడా పైశాచిక క్రైస్తవమనో ఇస్లామిక్ ఉగ్రవాదమనో మీరు అంటారా? అనరు. ఒక తప్పుడు అభిప్రాయం అభిప్రాయం వెలిబుచ్చిన వ్యక్తి హిందువైతే మాత్రం మధ్యలో అతని మతాన్ని కూడా మధ్యలోకి లాగి ఇరికించెయ్యాలని చూడటం ఏ సంస్కారం నేర్పింది?

   "చైనా కుట్ర అంటూ అబద్దాలు ప్రచారం చేసిన దేశభక్తులు నేడు ఆ చైనా మార్గం లోనే అంతకు మించిన కట్టడి, కర్ఫ్యూలు అమలు చేయకతప్పడం లేదు."అన్నారు మీరు.
   కర్ఫ్యూలు, కట్టడి చేస్తోంది ప్రభుత్వం. వ్యక్తులు కాదు. ఈ లెక్కన చైనా కుట్ర అని ప్రచారం చేసింది కూడా భారత ప్రభుత్వమే అనా మీ అభిప్రాయం?

   "చైనాపై అమెరికా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ద్వంద్వంగా ఖండించింది" అన్నారు.
   అమెరికా చేసింది "దుష్ప్రచారం" అయితే మరి చైనా వాళ్ళేమో "అమెరికా వాళ్ళే గత అక్టోబర్ మిలిటరీ విన్యాసాల్లో వైరస్ ని ఇక్కడ వదిలేశారు" అని అన్నారు. అది దుష్ప్రచారమా కాదా?

   "ప్రకృతి గొప్పది. దాన్ని అవగాహన చేసుకుని జీవించాలి" అని బోలెడన్ని కబుర్లు చెప్పే మీరు చైనాలో ప్రకృతి విధ్వంసాన్ని గమనించారా? అసలు ఈమధ్య వైరస్ లు చాలా వరకూ చైనాలోనే ఎందుకు పుడుతున్నాయి? (1) ఇష్టం వచ్చినట్లు అడవి జంతువులను వధించటం (2) విపరీతమైన కాలుష్యం (3) సొంతంగా తమ లాబ్స్ లో తయారు చెయ్యటం (4) వేరే దేశాల కుట్ర. వీటిలో ఏదో ఒక కారణం ఉండొచ్చుగా. మీరు కావాలంటే కన్వీనియెంట్ గా నాలుగో ఆప్షన్ తో ఫిక్స్ అయిపోవచ్చు. అలాగని మధ్యలో ఇండియానో హిందూ మతాన్నో ఇరికించాలని మాత్రం చూడొద్దు. దట్ విల్ బి దరిద్రగొట్టు ఆలోచన!

   Delete
  7. "గోమూత్రంతో వ్యాధి నయం అవుతుందని" ఒక వ్యక్తి అని ఉండవచ్చని మీరంటున్నారు. ఒక వ్యక్తి కాదు సూర్య గారు. అలాగే ఆ మాట అన్నవారందరూ హిందూ మతోన్మాదులే అన్నది నా ఉద్దేశం కాదు. అలా అని నేను వాదించినా తప్పే అవుతుంది. నిజానికి చాలామందిలో మతోన్మాదులు కానివారిలో కూడా చైనాపై ఈ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు రావడానికి కారణం ఒక వ్యక్తి కాదు. శక్తి. కావాలని చేసే దుష్ప్రచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు చూస్తున్న నేపథ్యంలో నేను ఈ ప్రచారాన్ని చేస్తున్నది హిందూ మతోన్మాదులనే అభిప్రాయపడుతున్నాను. అదే చెప్పాను. హిందువులని నేనెపుడూ దూషించలేదు. ఆ అవసరం కూడా లేదు. ప్రకృతి విధ్వంసం పై అంతర్జాతీయంగా ఏ దేశం, ఏ వ్యవస్థ ఎక్కువగా కారణం అవుతున్నదో అధికారిక లెక్కలు పరిశీలించి తప్పుబడదాం. అది చైనా అయినా అమెరికా అయినా భారత్ అయినా ఏ విధానం వల్ల, ఎందుకు పర్యావరణం నాశనం అవుతున్నది? ఎలా పర్యావరణాన్ని బాగు చేయాలన్నది మనందరి కర్తవ్యం. వైరస్ ల విషయంలో అమెరికాకు , చైనాకు మధ్య నడుస్తున్న వార్ లో ఏది నిజం అన్నది నిర్ధారణకు వచ్చాక మాట్లాడడం సరైనది. ఇపుడు చైనాపై దుష్ప్రచారం జరుగుతున్నదన్నది నిజం. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించినదీ నిజం. ఇక ఆహారపు అలవాట్లపై వైద్య శాస్త్రం ఏమి నిర్ధారించినది? అన్నది ఫైనల్ గా వాదనకు ఉపయోగిస్తారు. అలాగే అవి వ్యక్తిగతం కూడా. అంటే మాంసాహారిగా ఉండాలా? శాఖాహారిగా ఉండాలా? అన్నది వ్యక్తిగతం. అదే సందర్భంలో నిజంగా ఆరోగ్యానికి ప్రమాదమని సైన్స్ తేల్చితే ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. అది చైనానా? మరొకటా? అన్నది ముఖ్యం కాదు. మానవాళికి ఏది ఎలా మేలు చేస్తుందనేదే ముఖ్యం.

   Delete
  8. "చైనా కుట్ర" అని నిందించే క్రైస్తవున్నో ముస్లిమునో చూపిస్తే మీరేమంటారు? అపుడు కూడా పైశాచిక క్రైస్తవమనో ఇస్లామిక్ ఉగ్రవాదమనో మీరు అంటారా? అనరు. ఒక తప్పుడు అభిప్రాయం అభిప్రాయం వెలిబుచ్చిన వ్యక్తి హిందువైతే మాత్రం మధ్యలో అతని మతాన్ని కూడా మధ్యలోకి లాగి ఇరికించెయ్యాలని చూడటం ఏ సంస్కారం నేర్పింది?

   ఏ మతోన్మాదినైనా అనాల్సిందే. అనను అని మీరు చెప్పడం ధర్మం కాదు. నేను చెప్పిన ఉదాహరణలలో క్రైస్తవ స్వస్థత కూటములు కూడా ఉన్నాయి గమనించగలరు. హిందువు వేరు హిందూ మతోన్మాది వేరు. ఇస్లామిక్ టెర్రరిజం వేరు ఇస్లాం వేరు. క్రైస్తవం వేరు క్రైస్తవం పేరుతో జరిగే చండాలాలు వేరు. ఆ విషయంలో క్లారిటీ ఉంది సూర్య గారు. సందర్భాన్ని బట్టి ఎవరినైనా ఏ మతోన్మాదాన్నైనా ఎండగట్టాల్సిందే.

   కర్ఫ్యూలు, కట్టడి చేస్తోంది ప్రభుత్వం. వ్యక్తులు కాదు. ఈ లెక్కన చైనా కుట్ర అని ప్రచారం చేసింది కూడా భారత ప్రభుత్వమే అనా మీ అభిప్రాయం?

   ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు మాత్రమే చేయగలవా? స్థానిక ఎన్నిక విషయంలో కరోనాను చిన్న చూపు చూసి వ్యాఖ్యలు చేసిన జగన్ ప్రభుత్వమైనా చచ్చినట్లు ప్రజాక్షేమం కోసం స్వీయనిర్బంధాన్ని సమర్ధించాల్సిందే. ఈ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదు గనుక అవి వదిలేద్దం. కరోనా ఎఫెక్ట్ తగ్గాక ప్రభుత్వాల బాధ్యత, ప్రజారోగ్యం పట్ల పాలకులు, ప్రజలు చేయాల్సిందేమిటన్నది చర్చిద్దాం సర్.

   Delete
  9. https://www.businessinsider.com/wuhan-coronavirus-sars-bats-animals-to-humans-2020-1

   Delete
  10. ప్రవీణ్ గారూ, ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించగలరా?

   Delete
  11. It is difficult to type Telugu on smartphone.

   Delete
  12. "నిజానికి చాలామందిలో మతోన్మాదులు కానివారిలో కూడా చైనాపై ఈ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు రావడానికి కారణం ఒక వ్యక్తి కాదు. శక్తి. కావాలని చేసే దుష్ప్రచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు చూస్తున్న నేపథ్యంలో నేను ఈ ప్రచారాన్ని చేస్తున్నది హిందూ మతోన్మాదులనే అభిప్రాయపడుతున్నాను."
   దేన్నైనా నిర్ధారించుకోకుండా నమ్మకూడదు. కాని మీరు మాత్రం వదంతులు చూసి ఒక అభిప్రాయానికి వచ్చెయ్యవచ్చు.
   పైపెచ్చు చైనా పై "ఎవరికి" అనుమానమొచ్చినా దాని వెనుక ఉన్నది ఒక శక్తి అంటూనే వేలు ఒకవైపు చూపిస్తున్నారు.
   ఇతరులు రాస్తే వదంతులు. కాని మీరు మాత్రం "ఫలానా మతోన్మాదమే ఈ పని చేయిస్తోంది" అంటే అది వదంతి కాదు! మీరు చేస్తే సంసారం. ఇతరులు చేస్తే?!

   నేను రాసింది వన్య ప్రాణుల వధ గురించి. మీరు దాన్ని శాకాహారం మీదికి మళ్ళించారు. పైపెచ్చు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ఇష్టం అంటూ బాగా వెనకేసుకొచ్చారు.
   నా వ్యాఖ్యలో మాంసాహారం తప్పు అని ఎక్కడా అనలేదే! కోడి/బాతు, గొర్రె, ఎద్దు, పంది, ఆపైన రకరకాల సముద్రపు జీవులని ఈ ప్రపంచంలో ఎంతోమంది తింటున్నారు. వాటిని అవరసరమైనంతగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాలో కూడా. పైపెచ్చు చైనాలో ఉన్నది కమ్యూనిజమే అయితే ఆయా పదార్థాలు కూడా ఏ ఒక్కరి దగ్గరో పోగుపడి కుళ్ళిపోకుండా ప్రజా బాహుళ్యానికి అవసరమైనంత అందుబాటులో ఉండే ఉండాలి కదా. మరి అలాంటప్పుడు "ఇంకా ఇతర వన్యప్రాణులని వండుకుతినేంత అవసరం ఏమిటి?" అని మీలో ఒక్క చిన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కాలేదు.
   ప్రకృతిని గురించి ఎంతగానో బాధపడే మీలో అదే ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తున్నా "వాళ్ళిష్టం" అంటూ సర్దుకుపోవడం మీ విశాల మనస్తత్వాన్ని తెలియజేస్తోంది!

   Delete
  13. సూర్య గారు మీ విమర్శలో పనికి వచ్చే అమ్శాలను నోట్ చేసుకుంటాను. ధన్యవాదములు.

   Delete
 3. కొండల రావు గారూ హిందూ మతోన్మాద అన్న మాట మీరు వాడటం శోచనీయం. దయచేసి ఆ మాటను ఉపసంహరించు కొండి. చైనా కుట్రో కాదో తెలియదు కానీ చైనాలో వారి విపరీత నానా జంతు పక్షి కీటక మాంస భక్షణ వల్ల ఈ చైనా వైరస్ వ్యాప్తి చెందింది.

  గో మూత్రం పైన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గోమాత కంటికి కనిపించే దైవం.

  China has thrown the world into turmoil by not informing or alerting other countries and wilfully suppressing the virus outbreak. China should be held accountable for its misdeeds

  ReplyDelete
  Replies
  1. GKK సర్,

   జంతుమాంసం భుజించడం వల్ల కరోనా వచ్చిందని తేల్చలేదు. ప్రొటీన్ కోసం రోగ నిరోధక శక్తి కోసం మాంసం తినండని వైద్యులే చెప్తున్నారు. మాంసం భుజించడంలో చైనా ఎక్కువ మనం తక్కువ కాదు. ఇలాంటి విషయాల్లో దుష్ప్రచారాలు, అభూత కల్పనలు మంచివి కావు సర్. గో మూత్రం విషయం కరోనా విషయం లో వికటించిన వార్తలు మనం చూశాము కదా? మాంసాహారాం, శాఖాహారం విషయంలో విభిన్నవాదనలు ఉన్నాయి. ఈ విషయమ్లో పరిశోధనలు జరుగుతున్నాయి.

   గోమూత్రంపై పరిశోధనలు స్పష్టమ్గా ఇంకా ఇదీ నిజం అన్నంత స్థాయిలో ముఖ్యమ్గా హిందువులు చెప్పే ప్రయోజనాలు అన్నీ నిజమని నిర్ధారణ కాలేదు. వ్యవసాయ రంగంలో ఫలితాలు వస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం పరిశోధనా దశలో ఉన్నాయి. ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారిలో నేనొకడను. అయితే విపరీత ప్రచారాలు, లేని విశేషాలు నమ్మకాలవరకు ఓ.కె కానీ ప్రచారాలు ఎవరిష్ట ప్రకారమో, మతనమ్మకాల ప్రకారమో అయితే సైన్స్ ను అవమానించడమే అవుతుంది.

   నేను హిందువులకు వ్యతిరేకం కాదు. మతోన్మాదులకు మాత్రం వ్యతిరేకినే. హిందువులలో మతోన్మాదులే లేరంటారా? ఉన్నారని మీరంగీకరిస్తే నేను వారికి మాత్రం వ్యతిరేకమే.

   చైనాపై అమెరికా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ద్వంద్వంగా ఖండించింది. ప్రస్తుతం మోడీతో సహా ప్రపంచమంతా ఊహాన్ బాటనే అనుసరిస్తున్నది. కుట్రలు తేలితే ఎవరినీ క్షమించాల్సిన అవసరం లేదు. ముందే తప్పుడు ఉద్దెశాలతో ప్రచారాలు చేయడం ముమ్మాటికీ కుట్రే అవుతుంది.

   Delete
  2. Gomootra cannot kill virus. It is proved in lab test.

   Delete
  3. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ఏర్దోగన్ ఎన్నికలో చైనా పాత్ర ఉంది. అందుకే అతను చైనాకు అనుకూలంగా ప్రకటనలు చేశాడు అని వార్తలు వచ్చాయి.

   ఊహాన్ వైరస్ పరిశోధన శాలలో 1500 వైరస్ లు ఉన్నాయి అని గర్వం గా ట్వీటర్ లో 2018 లో ప్రకటించుకున్నారు. వారు గబ్బిలాల లోని వైరస్ పై పరిశోధనలు చేస్తున్నారు. ఏదో ప్రమాదం జరిగి ఆ ప్రమాదకర చైనా వైరస్ బయట పడి ఉండవచ్చు అని కూడా అనుమానం ఉంది. చైనా ఎన్నో విషయాలు బయటికి పొక్కనీయదు అనేది అందరికీ తెలుసు.

   2018 లోని ఆ త్వీటర్ ను ప్రముఖచైనా విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ గారు చెప్పారు. వెంటనే ఆ త్వీటర్ ను చైనా తొలగించింది.

   చైనా వైరస్ వ్యాప్తికి పూర్తిగా చైనా దే బాధ్యత.

   Delete
  4. ఈ విషయంలో మీ అభిప్రాయంతో ఏకీభించలేను సర్.

   Delete
 4. ప్రవీణ్ గారు ఇచ్చిన లింకు వ్యాసంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది sir ఊహాన్ వైరస్ గాబ్బిలాలనుంచి పాముల ద్వారా మనుష్యులకు వోహాన్ లోని సజీవ జంతు సరీసృపాలు మాంస విపణి ద్వారా వ్యాపించింది అని.

  చాలా మంచి వ్యాసం.

  ReplyDelete
  Replies
  1. It is not government's fault if people eat bat meat and snake meat. Americans eat pig meat but we dont blame the US government for swine flu.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top