ఇంగ్లీషు నేర్చుకుందామనుకుంటూ 25 సంవత్సరాలుగా వాయిదా వేస్తూ వస్తున్నాను. కరోనా పుణ్యమా అని అనివార్యంగా ఏర్పడిన ఖాళీ సమయంలో ఇపుడు ఇంగ్లీషు నేర్చుకుందామని ప్రయత్నం ప్రారంభించాను. యూ ట్యూబ్ లో Devika Bhatnagar's Telugu Channel లో వీడియోలను సెలెక్టు చేసుకున్నాను. మళ్ళీ మళ్ళీ వెతుక్కోకుండా నా బ్లాగులో ఉంచుతున్నాను. ఇలా చేయడం వలన మొదటిగా మీలో ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రెండోది నాకు మీ కామెంట్లు ద్వారా నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఈ వీడియోలు చూడడంతో పాటు ఇంకేమి చేస్తే బాగుంటుందో మీ సూచనలు సలహాలు చెప్పగలరు. వీలైనవి పాటిస్తాను. 
- పల్లా కొండలరావు,
2-5-2020,
చొప్పకట్లపాలెం.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top