1. ప్రకృతి జీవన విధానం - (13 ఎపిసోడ్లు)
ప్రకృతి జీవన విధానం-1
ప్రకృతి జీవన విధానం అంటే అంటే ఏమిటి?
ప్రకృతి సహజంగా జీవించడమే ప్రకృతి జీవన విధానం. మనిషి తప్ప 84లక్షల జీవరాసులలో మనిషి తప్ప మిగతా జీవులన్నీ ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. వాటి జీవితకాలం పాటు ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మనిషి జ్ఞానజీవి కనుక భిన్నంగా జీవిస్తున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే అసహజ జీవన విధానం, అనుకూలంగా, శరీర ధర్మాలకు అనుగుణంగా, ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించుకుంటూ సహజంగా జీవిస్తే అది ప్రకృతి జీవన విధానం అవుతుంది. 
ఆరోగ్యం అంటే నిర్వచనం ఏమిటి? 
వైద్య శాస్త్రాలలో ఏ జబ్బూలేకపోతే ఆరోగ్యం అని చెప్పారు. ఇది పూర్తి ఆరోగ్యానికి నిర్వచనం కాదు. ఏ జబ్బూ లేని స్థితి ఉంటే అది సగభాగం ఆరోగ్యం మాత్రమే. మరో సగభాగం ఏ జబ్బూ రానివ్వని స్థితి కూడా ఉంటేనే పూర్తి ఆరోగ్యం అవుతుంది. కనుక ఆరోగ్యం అంటే `ఏ జబ్బూ లేని స్థితి, ఏ జబ్బూ రానివ్వని స్థితీ రెండూ కలిగి ఉంటే ఆరోగ్యం' అవుతుంది.
సంపూర్ణ ఆరోగ్యం అంటే నిర్వచనం ఏమిటి?
సంపూర్ణ ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నిర్వచనం : మనిషికి 1) శారీరక 2) మానసిక 3) సామాజిక 4) ఆధ్యాత్మిక ఆరోగ్యములు కలిగి ఉంటే 'సంపూర్ణమైన ఆరోగ్యం` అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం తెలిపింది.
××××××××××××

ప్రకృతి జీవన విధానం-2
ఆరోగ్యం పోవడం ముందా? రోగం రావడం ముందా? 
మనందరం ఒకమాట వింటుంటాం. నాకీ మాయదారి జబ్బులొచ్చాకనే నా ఆరోగ్యమంతా పోయింది అంటుంటారు. అంటే జబ్బు రావడం వలన ఆరోగ్యం దెబ్బతిన్నదని దీనర్ధం. అందరూ ఇలాగే అంటుంటారు. మనం వింటుంటాం. నిజమే కదా అనుకుంటాం. కానీ అది సరికాదు. ఆరోగ్యం పోతేనే జబ్బులొస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకున్నంతకాలం మనకు ఏ జబ్బూ రాదు. కాబట్టి ఏజబ్బూ లేని స్థితీ, ఏ జబ్బూ రానివ్వని స్థితీ ... ఈ రెండింటినీ కాపాడుకుంటే మనకు ఏ జబ్బులు రాకుండా ఉండే శక్తిని కలిగి ఉంటాము. వెలుతురు ఉన్నంత సేపూ చీకటి రాదన్నట్లుగా ఆరోగ్యం ఉన్నంత కాలం జబ్బులు రావు. విత్తనాలలో ఆరోగ్యం బాగున్నంతకాలం పుచ్చు రాదు. మురుగుగుంటలో నీటి ఆరోగ్యం బాగున్నంతకాలం వాసనరాదు. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం అసలు శరీరాన్ని గురించి, ఆరోగ్యం గురించీ పట్టించుకోవడం లేదు. జబ్బు వచ్చాక, ముదిరాక తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది చాలా తప్పు. మనం ఎల్లపుడూ మనలో ఉండే ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

××××××××××××
ప్రకృతి జీవన విధానం-11
ప్రకృతి జీవన విధానం అంటే అంటే ఏమిటి?
××××××××××××
2. ఆరోగ్యానికి పునాది ఎక్కడ! - 07 ఎపిసోడ్లు

3. ఆరోగ్యానికి నీటి ప్రాముఖ్యత - 15 ఎపిసోడ్లు

4. సుఖ విరేచన రహస్యం - 21 ఎపిసోడ్లు

5. సంపూర్ణ ఆరోగ్య రహస్యం - 26 ఎపిసోడ్లు

6. ప్రొద్దుపోయి తినడం వలన అనర్థాలు - 13 ఎపిసోడ్లు

7. రోజుకు ఎన్ని సార్లు తినాలి? - 13 ఎపిసోడ్లు

8. ప్రకృతి వైద్య రహస్యం - 10 ఎపిసోడ్లు

9. శరీరానికి సర్వీసింగ్ రహస్యం - 08 ఎపిసోడ్లు

10. ఉపవాస రహస్యం - 18 ఎపిసోడ్లు

11. లంఖణం పరమౌషధం - 20 ఎపిసోడ్లు

12. మాంసాహార రహస్యం - 22 ఎపిసోడ్లు

13. శ్వాస రహస్యం - 19 ఎపిసోడ్లు

14. వ్యాయామ రహస్యం - 35 ఎపిసోడ్లు

15. రుచులు తెచ్చే రోగాలు - 46 ఎపిసోడ్లు

16. రోగాలు రాని రుచులు - 119 ఎపిసోడ్లు

17. జీర్ణాశయ రహస్యం - 29 ఎపిసోడ్లు

18. లివరు రహస్యం - 14 ఎపిసోడ్లు

19. అధిక బరువు రహస్యం - 17 ఎపిసోడ్లు

20. షుగరు రహస్యం - 31 ఎపిసోడ్లు

21. గుండె రహస్యం - 24 ఎపిసోడ్లు

22. కీళ్ళ రహస్యం - 10 ఎపిసోడ్లు

23. సందేహాలు - సమాధానాలు - 23 ఎపిసోడ్లు

24. సాధారణ సమస్యలు - చక్కని చిట్కాలు - 79 ఎపిసోడ్లు

25. ముఖ్యమైన పండగల అంతర్యాలు - 10 ఎపిసోడ్లు
***

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top