ప్రజ – ‘ప్రశ్న' మీదే.. ‘జవాబూ మీదే'.. శీర్షకతో గతంలో ఘనవిజయం సాధించిన విషయం విదితమే. అనివార్య కారణాల రీత్యా తదుపరి నిర్వహణ సాధ్యపడక 'పల్లెప్రపంచం' బ్లాగులోనే కలగలిపి ఇప్పటివరకూ నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుత 'ప్రజ' నిర్వహణ మునుపటిలా లేనప్పటికీ అనేక ప్రశ్నలూ, సమర్థవంతమైన చర్చలూ ఇప్పటికీ జరుగుతూన్నాయి.

ఇటీవల కాలంలో 'ప్రజ' ను పున:ప్రారంభిస్తే బాగుంటుందని భావించాము. మారుతున్న సాంకేతిక అవసరాలకు తీసిపోకుండా, సమర్థవంతమైన చర్చలకు వేగంగా, సులభంగా, శక్తివంతమైన చర్చావేదికగా 'ప్రజ'ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేశాము.

ఫలితంగా 'ప్రజ' ను www.praja.net డొమైన్ తో ఒక కొత్త స్వేచ్ఛా చర్చావేదికగా అందుబాటులోకి తీసుకువచ్చాము. ఈ చర్చావేదిక ద్వారా:
  • కొత్త ప్రశ్నలు/చర్చలను ఎవరైనా చాలా సులువుగా సృష్టించవచ్చు! 
  • విభాగాల వారీగా చర్చలను నిర్వహించవచ్చు. 
  • మొబైల్ వర్షన్ అందుబాటులో వున్నందున, స్మార్ట్ ఫోన్ తో సైతం చర్చలలో పాల్గొనడం సులువు. మొబైల్ అప్లికేషన్లా కూడా అందుబాటులో వుంది!
  • ఎన్ని ప్రశ్నలనైనా ఎంతమంది ఒకే సమయంలో ప్రశ్నించినా దృష్టి మరలకుండా సరైనా ఫాలో-అప్ అప్రమేయంగా జరుగుతుంది (నోటిఫికేషన్లు / ఈమెయిల్ ద్వారా). మీరు పాల్గొన్న చర్చలు / తాజాగా జరిగే చర్చలు మీరు కోరినట్లుగా అలర్ట్స్ (e-Mail / mobile notifications) వస్తాయి. తద్వారా మీరు పాల్గొన్న చర్చల తాజా పరిస్థితి తెలుసుకోవచ్చు. 
  • మోడరేషన్ ను అవసరాన్ని బట్టి బాధ్యతకలిగిన, ఆసక్తి చూపిన సభ్యులకు అందించవచ్చు. మోడరేట్ అయిన ప్రశ్నలు, జవాబుల వివరాలు కూడా అందరికీ కనపిస్తాయి.
  • అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు/ప్రశ్నలను సమర్థవంతంగా తొలగించవచ్చు. 
  • చర్చలలో పాల్గొంటున్న సభ్యులు అవసరాన్ని బట్టి వ్యక్తిగత సందేశాలు పంపుకోవచ్చు. 
  • చర్చించిన సందేశంలో తప్పొప్పులను సభ్యులు మార్చుకోవచ్చు(మార్చిన సందేశం రికార్డవుతుంది). 
  • మితిమీరిన చర్చలను అన్ లిస్టు చేయవచ్చు (కొత్తవారికి కనిపించదు, కానీ అప్పటికే చర్చలో పాల్గొన్నవారికి అప్పటివరకు నడిచిన చరిత్ర కనిపిస్తుంది. వారా చర్చను తదుపరి కొనసాగించడానికి అవకాశం కూడా వుంటుంది).
ప్రస్తుత 'ప్రజ' నిర్వహణ మారిన సాంకేతిక అవసరాలకు సరిపోలేదన్న వాస్తవాన్ని గుర్తించి, చర్చలకు సరైన ఫాలో అప్ వుండే విధంగా, ‘ప్రజ' కు అగ్రిగేటర్ల అవసరాన్ని తగ్గించే దిశగా, సరైన చర్చలకు శక్తివంతమైన చర్చావేదికగా తీర్చిదిద్దామనుకుంటున్నాము.

సరికొత్త 'ప్రజ' – www.praja.net చర్చలకు ఆసక్తికరంగా, అన్ని విధాలా అనువుగా వుంటుందని భావిస్తూ, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము.
చర్చలు ఈ విధంగా వుంటాయి:

‘ప్రజ' లో చర్చించేందుకు గూగుల్ అకౌంటు / ఫేస్బుక్ అకౌంటు / ఈమెయిల్ ద్వారా లాగినయి చర్చించవచ్చు. కొత్త చర్చ/ప్రశ్న ఈ క్రింది బొమ్మలో చూపించినట్లు చేసి సృష్టించవచ్చు:ఈ 'ప్రజ' నిర్వహణకు అవసరమైన ఖర్చులన్నింటినీ 'పల్లెప్రపంచం సర్వీసెస్ సొసైటీ' భరిస్తుంది.

Post a Comment

RSS అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం చరిత్ర జనవిజయం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా
 
Top