Sunday, September 13, 2020

బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనమా? మీరేమంటారు?

బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనం

-------------------------------------


ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?
 
ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.

కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో  ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.

రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వై

పు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం

BIG BOSS. BIG BOSS

ఎవడీ BIG BOSS ?
ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?
ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?
ఎవరి కోసం వచ్చాడు ఈ  BIG BOSS ?
మన ఇంటికే  ఎందుకు  వచ్చాడు ఈ  BIG BOSS ?
వీడి విష సంస్కృతి ఏమిటి ?

  ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుం

బ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS .

బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .

మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ  Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి
మీరు ఏ నాడైన ఆలోచించినారా?
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .

ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు .
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ?
ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం .
మరి

భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త  పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , అనుమతిస్తారా ?
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి ఒప్పుకుంటారా?
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు  Big Boss ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు .
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి .
మేలుకోండి
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V.  తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .

విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .

చూస్తారా ?  చూస్తారా ?
 
🚩👨‍👨‍👦‍👦సగటు భారతీయుడు బాధతో..👨‍👨‍👦‍👦🚩.××××××××××××××××××××××××

నాకు వచ్చిన ఓ వాట్సాప్ మెసేజ్. ఆలోచించదగినదనిపించింది. మీరేమంటారు?

 

7 comments:

 1. ఏమిటప్పా లో వచ్చిన పై సందేశం ముమ్మాటికీ నిజం. బిగ్ బాస్ , జబర్దస్త్ అనేవి పరమ జుగుప్సాకరమైన , నీచ నికృష్ట పోగ్రాములు.

  ReplyDelete
 2. “బుచికి” గారు చాలా సున్నితంగా చెప్పారు అంటాను నేను. తెలుగు ప్రజలు “చరిత్ర ఎరుగని” మహా మహా పాపం చేసుకున్నారేమో అటువంటి వాటి బారిన పడ్డారు.

  అఫ్-కోర్స్, మనలాంటి వారిది కంఠశోష లెండి. ఎందుకంటే అవన్నీ ఊహించలేనంత ఆదాయం, లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారాలు. అంతే గానీ సభ్యతతో కూడిన క్లీన్ వినోదం మనకి అందిద్దామనే మహోన్నత ఆశయం వారికేమన్నా ఉందా అన్నది సందేహాస్పదమే. నాకు అర్థం కానిది ఏమిటంటే ఇప్పటికే వందలు, వేల కోట్లు సంపాదించుకున్న వారు కూడా ఇటువంటి ప్రోగ్రాములను చేపట్టడం.

  ReplyDelete
 3. >>సభ్యతతో కూడిన క్లీన్ వినోదం మనకి అందిద్దామనే మహోన్నత ఆశయం వారికేమన్నా ఉందా

  సభ్యతా, సంస్కారాలు అంటే చూసేవాడున్నాడా?

  ReplyDelete
  Replies
  1. జంధ్యాల గారు తీస్తే ఆదరించారు కదా?

   Delete
  2. tv shows గురించి నేను చెప్పేది. తక్కువ బడ్జెట్లో తీసి,ఎక్కువడబ్బులు సంపాదించాలంటే, ఇలానేవుండాలి. షూటింగంతా ఒక్క చోటే జరగడంవల్ల, సమయం కూడా ఎంతో కదా. ఎపిసోడ్ కి ఇంత అని లెక్కగట్టి చెల్లించే ఈ కాలంలో తప్పదనుకుంట

   Delete
  3. జంధ్యాల కాలంలో కూడా "క్లీన్" సినిమాల కంటే ఓలమ్మి తిక్క రేగిందా తరహాలే ఎక్కువ డబ్బులు సంపాయించాయి. కోటా శ్రీనివాసరావు బాబూ మోహన్ "హాస్యం" సీన్లు జబర్దస్తు కంటే సభ్యత గలవా, కాదే. ఎవరి మార్కెట్ వాళ్ళది. నిజానికి ఇప్పుడే కాస్త నయం: మంచి కంటెంట్ వేసేందుకు ఎక్కడో ఎక్కడ కొన్నయినా అవకాశాలు వస్తున్నాయి.

   Delete
  4. మార్పు ఎపుడూ సాపేక్షమే జై గారు. ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయని ఆశిద్దాం. ప్రయత్నిద్దాం. అటువంటి ప్రయత్నాలను ఆదరిద్దాం.

   Delete